వెంకటాపురం చేరుకోనున్న అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలు.

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం చేరుకోనున్న అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలు.

– స్వాగతం పలకాలంటూ భక్తమండలి పిలుపు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం శ్రీ రామ జన్మభూమి రామాలయం అక్షింతలు ప్రత్యేక వాహనంలో వెంకటాపురం రానున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ చంద్రమూర్తి అక్షింతలకు ఘన స్వాగతం పలకాలని భక్తమండలి సోమవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా భక్తులకు ఆహ్వాన పలికింది. భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యకు సంబంధించిన అక్షంతలు నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక వాహనంలో చేరుకోనున్నాయన్నారు.  అత్యంత పవిత్రమైన అయోధ్య శ్రీ సీతారామచంద్ర మూర్తి వారి అక్షింతలు వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా దేవి మందిరం నుండి పద్మావతి, అలివేలు మంగ, వెంకటేశ్వ ర స్వామి వారి ఆలయానికి కలశ శోభాయాత్ర ద్వారా భక్తులు జైశ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే మిన్నంటిన స్వామివారి నినాదాలతో భారీ ఊరేగింపు ద్వారా అక్షంతులను తీసుకుపోవడం జరుగు తుంది. ఈ భక్తిరస శోభాయాత్రకు భక్తులందరూ పెద్ద సంఖ్య లో శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని, భక్తమండలి అశేష భక్తజన వాళికి స్వామి వారి ఆశీర్వాదంతో ఆహ్వానం పలుకుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.

Tj news

1 thought on “వెంకటాపురం చేరుకోనున్న అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలు.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now