హిందూ ధర్మంతోనే భారత్ విశ్వ గురువుగా వెలసిల్లుతుంది

On: April 18, 2026 10:23 PM

హిందూ ధర్మంతోనే భారత్ విశ్వ గురువుగా వెలసిల్లుతుంది

హిందూ ధర్మంతోనే భారత్ విశ్వ గురువుగా వెలసిల్లుతుంది

ప్రకృతితో నడిచే ధర్మం హైందవ ధర్మం

భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామీజీ

ఐక్యత లోపించి వెయ్యేళ్లు బానిసత్వంలో ఉన్నాం : ధర్మజాగరణ సంయోజక్ ఏలే శ్యాం జీ

ములుగులో ఘనంగా  హిందూ సమ్మేళనం

ములుగు. ఏప్రిల్ 18, తెలంగాణ జ్యోతి : హిందూ ధర్మంతోనే భారత్ రానున్న రోజుల్లో విశ్వగురువుగా విలసిల్లుతుందని, ప్రకృతితో నడిచే ధర్మం హైందవ ధర్మమని భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామీజీ స్పష్టం చేశారు. పంచభూతాల సాక్షిగా, దేశం కోసం ధర్మం కోసం నడిచే ప్రతీ ఒక్కరికీ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. శనివారం ములుగులోని మంజునాథపురం రావణాసురవధ ఉత్సవ సభా ప్రాంగణంలో త్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ అధ్యక్షతన హిందూ సమ్మేళనం జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు హోమంలో పాల్గొన్నారు. నవధాన్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ కమలానంద భారతీ స్వామీజీ హాజరై ప్రవచనాలు అందించారు. మంచి కోసం ముందుకు సాగాలని, చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. సనాతన ధర్మం ఎప్పుడూ అంతం కాలేనిదని, భారతీయ మూలాల్లోనే ధర్మం నలుదిక్కులా విలసిల్లిందన్నారు. అనంతరం ధర్మజాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలే శ్యాం కుమార్ జీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. బ్రిటీషర్లను తరిమడంతోపాటు స్వాతంత్రం వచ్చిన తరువాత దానిని నిలుపుకోవడం కోసం డాక్టర్ హేడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను 1925లో స్థాపించారన్నారు. 1923లో కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నా ఆయన దేశం కోసం ధర్మం కోసం సంస్థను స్థాపించి దేశంలో ప్రస్తుతం లక్షల గ్రామాలకు విస్తరించడంతోపాటు విదేశాల్లో 50దేశాలలో కార్యకలాపాలు నడిపిస్తోందన్నారు. హైందవ జాతిలో ఐక్యత లోపించిందన్నారు. విదేశీ సంస్కృతికి అలవాటు పడి స్వదేశాన్ని విస్మరించడం భవిష్యత్ లో యువత వినాశనానికి కారణమవు తోందన్నారు. ప్రపంచానికి జ్క్షానాన్ని ఇచ్చిన దేశం, అత్యంత శక్తివంతమైన దేశం భారతదేశమని శ్యాం జీ కొనియాడారు. మేథావులంతా ఆలోచించాలని, హిందూ సమాజం సంఘటితంగా ఉండాలన్నారు. జాతీయ భావనతో దేశం కోసం ధర్మం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూత్వమంటే జీవన విధానమని స్పష్టం చేశారు. మత రాజకీయాలు చేసేందుకు హిందూత్వం మతం కాదని, ధర్మం అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యక్తి నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత సమాజంలో యువత మత్తులో కూరుకుపోతోందని, ఆడబిడ్డలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ సేవికా సమితి కార్యకారని రూప అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరువేల మంది ప్రజలు పాల్గొన్నారు. దేశభక్తి, సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్, గౌరవ అధ్యక్షుడు దేవీలాల్, సభ్యులు వాంకుడోతు జ్యోతి, కర్రా రాజేందర్ రెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి, కొత్తపల్లి పోషన్న, మేకల సంపత్, పింగిళి నాగరాజు, శ్రీహరి, బాషబోయిన మహేందర్, రాజ్ కుమార్, భాస్కర్ రెడ్డి, వాసు, బలరాం, తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మంతోనే భారత్ విశ్వ గురువుగా వెలసిల్లుతుంది

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!