రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్ఐ కృష్ణప్రసాద్
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 18, తెలంగాణ జ్యోతి: ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించి సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేరూరు ఎస్ఐ జి. కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం ధర్మవరంలోని ప్రధాన కూడలిలో ‘ఎర్రైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షణ కవచమని సూచించారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాకుండా ప్రాణాలను కాపాడటానికేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక వాహనదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. నిబంధనలు పాటించిన పలువురు వాహనదారులను ఎస్ఐ అభినందించారు.









