పురుషులకు ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక సీట్లు కేటాయించాలి. 

Written by telangana jyothi

Published on:

పురుషులకు ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక సీట్లు కేటాయించాలి. 

– సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పోస్టింగులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడంతో, ఆర్టీసీ బస్సులలో పురుషులు ప్రయాణించే అవకాశం లేకుం డా పోతుందని పురుషులకు ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ సోషల్ మీడియాలో పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులలో పురుష ప్రయాణికులు ప్రయాణించే వీలు లేకుండా పోయిందని, వృద్ధులు సీనియర్ సిటిజన్లు, ఇతరులకు మహిళల రద్దీ కారణంగా ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయిందని సోషల్ మీడియాలలో పేర్కొన్నారు. గతంలో టీఎస్ ఆర్టీసీ బస్సులలో స్త్రీలకు ప్రత్యే కం అని కొన్ని సీట్లు రిజర్వేషన్ చేసేవారు. అలాగే సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగులకు, మరియు ఎమ్మెల్యే ఎంపీ లకు సీట్లు రిజర్వేషన్ తో ఆయా సీట్లపై ఆర్టీసీ అధికారులు పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవారు. రిజర్వేషన్ కు సంబంధించిన వారు బస్సులలో లేనప్పుడు ఆయా సీట్లలో ఎవరైనా కూర్చొని ప్రయాణించేవారు. ఇటీవల నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశ పెట్టడంతో, పురుషులు వృద్దులు ఇతరులు సీట్లు లేక నిలబడి ప్రయాణించే దుస్థితి ఏర్పడిందని, దీంతో తాము తీవ్ర అసౌకర్యంతో ప్రయాణాలు మానుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటు న్నారు. అలాగే ట్రాన్స్ జెండర్స్ ఉచిత ప్రయాణంతో బస్సుల లో పురుష ప్యాసింజర్లను భాయ్యా ఆంటూ హేళనగా మాట్లా డుతున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి.ఆర్టీసీ బస్సులలో సగం సీట్లు పురుషులకు ప్రత్యేకమని, సీట్లపై రిజర్వేషన్ రాయాలని మిగతా సగం మహిళలకు కేటాయిం చాలని అనే డిమాండ్ తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో కొంతమంది పురుషులు బస్సు ఎదురుగా ఉండి ధర్నా చేస్తున్న పోస్టింగులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రవేశ పెట్టడంతో, ఆ రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని వార్తలు వెలుపడ్డాయి. దీంతో ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బస్సులలో కొన్ని బస్సులను మెన్ ఓన్లీ అని బోర్డులు పెట్టి బస్టాండ్లలో పురుషులను మాత్రమే ఎక్కించుకొని మిగతా బస్సులలో మహిళలకు కేటాయించినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు హల్చల్ చేస్తున్నాయి. అదే విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పోస్టింగులు పెట్టడం, ఆయా పోస్టింగులు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తున్నాయి.

Tj news

1 thought on “పురుషులకు ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక సీట్లు కేటాయించాలి. ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now