బర్లగూడెం పంచాయతీలో వాలీ బాల్ టోర్ని
-బహుమతులు అందించిన ఆదివాసి నేతలు
వెంకటాపురం నూగురు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ లో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గురువారం వాలీబాల్ టోర్నమెంట్ ను సర్పంచ్ కొర్సా నర్సింహా మూర్తి, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి చింత సోమరాజులు క్రీడాకారుల మధ్య రిబ్బన్ కట్ చేసి క్రీడలు ప్రారంభించారు. బర్లగూడెం గ్రామపంచాయతీలో ఉన్న తొమ్మిది గ్రామాల నుండి 20 జట్లు ఈ టోర్ని లో పాల్గొన్నాయి. పంచాయతీ పరిధిలో ఉన్న క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు సర్పంచ్ కొర్స నర్సింహా మూర్తి తెలిపారు. క్రీడాకారుల కోరిక మేరకు ఈ టోర్ని నిర్వహించినట్టు తెలిపారు. పి.ఈ.టి లు గా చింత జగన్, బొచ్చ నర్సింహా మూర్తి, గొంది హన్మంత్ వ్యవహారించా రు. ప్రథమ స్థానం లో గెలుపొందిన మహితాపురం విజేతలకు ఆదివాసీ న్యాయవాది ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, మేధావి కానిస్టేబుల్ చింత సర్వేశ్వర్ రావు ల చేతుల మీదుగా 3 వేల రూ. అందజేయడం జరిగింది. ద్వితీయ స్థానం పొందిన ఒంటిమామిడి విజేతలకు రెండు వేల రూపాయలు నగదును కరాటే మాస్టర్ గొంది హన్మంత్ రావు, కార్యదర్శి తాటి మౌనిక, పి .ఈ.టి లు జగన్,బొచ్చ నర్సింహా మూర్తి చేతుల మీదుగా అందజేశారు. తృతీయ స్థానం లో నిలిసిన జెల్లా కాలనీ విజేతలకు ఉప సర్పంచ్ ఇర్ప రవి పదిహేను వందల రూపాయలు అందించారు. నాల్గవ స్థానం లో నిలిచిన చిన్నగాంగారం క్రీడా కారులకు వార్డ్ మెంబర్ ఇర్ప బాబు చేతుల మీదుగా వెయ్యి రూపాయలు అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన క్రీడా సామాగ్రిని అన్ని గ్రామాల క్రీడా కారులకు అందజేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో క్రీడా కారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
బర్లగూడెం పంచాయతీలో వాలీ బాల్ టోర్ని
Written by telangana jyothi
Updated on: