Ts, Cm | దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం : ఫైలుపై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
డెస్క్ : నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డు ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానమైన రజిని దివ్యాంగురాలైనప్పటికి కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కలిసి.. ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ప్రమాణ స్వీకారం రోజున రెండవ సంతకం రజని ఉద్యోగం ఫైల్ పై సంతకం చేశారు.
1 thought on “Ts, Cm | దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం : ఫైలుపై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.”