బహుజనులే రాజ్యాధికారం సాధించాలి

బహుజనులే రాజ్యాధికారం సాధించాలి

– బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ వినతి

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: సమాజంలో సగభాగానికి ఎక్కువగా ఉన్న బహుజనులే రాజ్యాధికారం దిశగా పయనం సాగించాల్సిన అవసరం ఉందని మంథని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.కాటారం మండలం లో విస్తృతంగా పర్యటనలు చేసిన అనంతరం శంకరంపల్లిలో పలు పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జక్కు రాకేష్ సమక్షంలో సుమారు 150 మంది యాదవులు చేరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎంపిటిసి బండం రాజమణి, నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి, జాగరి మహేష్, పోత సంతోష్, అత్కురి శంకర్, ఉప్పుల వెంకటేశ్, కుసుమ బానయ్య, రాజబాబు, కొండపర్తి మురారి, లక్ష్మీనారాయణ, కామిడి ప్రమోద్ , తుల్సెగారి దేవేందర్, జనగాం సడవలి, బొర్రకుంట రాజయ్య, చింతల సంపత్, జిముడా రాజేష్, సాగర్, సంతు, తోటి మనోహర్, కుసుమ నరేష్ , వంగల రాజేంద్రచారి తదితరాలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment