Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్

On: February 5, 2026 5:35 PM

గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్

గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్

ములుగు, ఫిబ్రవరి 05, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గంలో దుప్పుల గుంపు రోడ్డును దాటుతున్న సమయంలో ఇసుక లారీ ఢీకొనడంతో ఒక దుప్పి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారి గడ్డి శ్రీనివాస్ ఈ ఘటనను గమనించి స్పందించారు. సృజన్, రాంబాబు సహా మరికొందరి సహకారం తో దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం బైక్‌పై ఏటూరునాగారం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి పశు వైద్యాధికారి ద్వారా చికిత్స చేయించారు. అనంతరం దుప్పిని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వన్యప్రాణులు అడవికి ఆభరణాల వంటివని, వాటిని కాపాడుకున్నప్పుడే జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉండి మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సృజన్, రామన్నగూడెం రాంబాబు, దయానంద్ బీట్ ఆఫీసర్, అబ్దుల్ రెహ్మాన్ (ఎఫ్‌ఆర్‌ఓ), డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నారాయణతో పాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!