సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ములుగులో ధర్నా
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని డిమాండ్
ములుగు, జనవరి 16, తెలంగాణ జ్యోతి : జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఇచ్చిన పిలుపులో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పూర్తి స్థాయిలో పని కల్పించకపోవడం, కేంద్రం–రాష్ట్రాల నిధుల వాటాలో మార్పులు చేసి రాష్ట్రాలపై భారం మోపడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నూతన విత్తన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకంగా మారాయని, లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సమ్మె హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు హరించబడుతున్నాయని పేర్కొంటూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలన్నింటిని రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. అనంతరం “వర్ధిల్లాలి సంయుక్త కిసాన్ మోర్చా” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జంపాల రవీందర్ (సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి), ఎండి అజాద్ భాష, రత్నం రాజేందర్, నటరాజ్ ప్రవీణ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.






