మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం , జనవరి 16, (తెలంగాణ జ్యోతి) : జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ శాఖ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర శాఖల అధికారులతో మినీ మేడారం జాతరల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా పరిశుబ్రమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతర ప్రాంగణంలో పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా పరిశుబ్రమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. జాతరలు జరిగే మార్గాల్లో రోడ్లకు ఇరువైపుల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, మూల మలుపుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జాతరలు నిర్వహించే మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. భూపాలపల్లి మండలంలో కమలాపూర్, గుర్రంపేట ప్రాంతాల్లో రెండు జాతరలు జరుగు తున్నందున ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మినీ మేడారం జాతరలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు సునీల్, బాబురావు, విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డి, ఆర్డీవో హరికృష్ణ, డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.






