రామాలయంలో ఘనంగా గోదా కళ్యాణ మహోత్సవం
ములుగు,జనవరి 14 (తెలంగాణ జ్యోతి) : ములుగులోని రామాలయం లో గోదాదేవి కళ్యాణ మహోత్సవం సంక్రాంతి భోగి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు కళ్యాణ తంతు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణ ఘట్టాన్ని వైదిక సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించి భక్తులకు దర్శనంగావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవుల ప్రశాంత్ రెడ్డి, మేడికొండ వెంకట్ రెడ్డి, గట్ల సత్యనారాయణ రెడ్డి, చింతలపూడి చిన్న కొండారెడ్డి, దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.






