విద్యుత్ లబ్ధిదారులకు శుభాకాంక్షల లేఖల పంపిణీ

On: January 13, 2026 4:56 PM

విద్యుత్ లబ్ధిదారులకు శుభాకాంక్షల లేఖల పంపిణీ

విద్యుత్ లబ్ధిదారులకు శుభాకాంక్షల లేఖల పంపిణీ

ఏటూరునాగారం, జనవరి 13 (తెలంగాణ జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం మరియు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు, గృహ వినియోగదారులకు డిప్యూటీ ముఖ్యమంత్రి పంపిన నూతన సంవత్సరం – సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్, గృహ జ్యోతి పథకాల వల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించి, ప్రతి రైతు మోటార్లకు స్టార్టర్లు, కెపాసిటర్లు అమర్చుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా సమ్మయ్య, లైన్మెన్ అచ్చ మొగిలి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!