మేడారం జాతరకు ‘MyMedaram’ వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం
ములుగు, జనవరి 13 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు సాంకేతిక సాయంగా ‘MyMedaram’ వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తులు 7658912300 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన అన్ని కీలక సమాచారం ఒకే చోట పొందవచ్చు. ఈ చాట్‌బాట్ ద్వారా మేడారం జాతర మొబైల్ యాప్ లింక్
(https://play.google.com/store/apps/detailsid=com.itprofound.medaramjathara)
రూట్ మ్యాప్‌లు, టాయిలెట్ బ్లాక్స్ లొకేషన్లు, వైద్య శిబిరాల వివరాలు, ట్రాఫిక్ అప్‌డేట్స్, హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు, జాతర చరిత్ర, గ్రీవెన్స్ రైజింగ్ (ఫిర్యాదు నమోదు), మిస్సింగ్ పర్సన్ రిపోర్టింగ్ సిస్టమ్, నీటి సౌకర్యాలు మరియు ఇతర వసతుల లొకేషన్లు తక్షణమే తెలుసుకోవచ్చు. ఈ సేవలు వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు వాట్సాప్ చాట్‌బాట్ మూడింటిలోనూ సమగ్రంగా అందుబాటులో ఉండటంతో భక్తులకు జాతర సమయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అవసరమైన సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే ప్రతి భక్తుడు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని వారు సూచించారు.









