సంక్రాంతి శుభాకాంక్షలు :జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

On: January 13, 2026 3:33 PM

సంక్రాంతి శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, జనవరి 13, తెలంగాణ జ్యోతి :  జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ  భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగలను పురస్కరించుకుని  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని ఆయన తెలిపారు.  కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు. పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ  గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు. పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని  సూచించారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!