ఎంపీడీఓ ఎవరు..?
సందిగ్ధంలో కన్నాయిగూడెం ప్రజలు..!
కన్నాయిగూడెం, జనవరి 13 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలో ప్రస్తుతం ఎంపీడీఓ (MPDO) ఎవరు అనే విషయంలో ప్రజలు, లబ్ధి దారులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో ఎంపీడీఓను సంప్రదించగా, “నేను ట్రాన్స్‌ఫర్ అయ్యాను” అనే సమాధానం వస్తోందని స్థానికులు తెలిపారు. అయితే కొత్తగా నియమితు లైన ఎంపీడీఓ ఎవరో, ప్రస్తుతం బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో మండల కార్యాల యంలో అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు తమ సమస్యలు, దరఖాస్తులు, బిల్లులు, ధ్రువీకరణల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఇందిరమ్మ గృహాల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అధికారిక బాధ్యత వహించే ఎంపీడీఓ లేకపోవడం వల్ల పనులు పూర్తిగా స్థగించిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.కనీసం ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఎవరో అయినా అధికారికంగా ప్రకటించి, మండల పరిపాలనకు స్పష్టత తీసుకురావాలని కన్నాయిగూడెం ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.






