సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలు
ఏటూరునాగారం, జనవరి 12 (తెలంగాణ జ్యోతి): మండలంలోని చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామీణ క్రీడలను ఘనంగా నిర్వహించారు. రెండు ఎంపీటీసీ పరిధిలోని షాపల్లి, కొండాయి, శివపురం, చిన్న బోయినపల్లి గ్రామాలకు చెందిన యువకులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ములుగు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను తిలకించి, కొండాయి–షాపల్లి మధ్య జరిగిన వాలీబాల్ ఫైనల్ విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో చిన్న బోయినపల్లి యూత్ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామపంచాయతీల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడలను విజయవంతం చేశారు.






