వయోవృద్ధులకు ప్రణామ్ డే కేర్ సెంటర్
వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ములుగు, జనవరి 12, తెలంగాణ జ్యోతి : వయో వృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణామ్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయగా సోమవారం ములుగులోని సంక్షేమ భవన్ లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఆధునిక సమాజంలో వయో వృద్ధులపై తమ వారసులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని, జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. ఈ కేంద్రాన్ని వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ప్రతీ రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రభుత్వ సెలువులు మినహా అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ప్రతీ రోజు కాలక్షేపం కోసం ఆటలు, పాటలు, మంచి సమాచారం అందించే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ డే కేర్ సెంటర్ ను వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా వైస్ చైర్మన్ జి.శ్రీనివాస్, ట్రెజరర్ ఎస్.సతీష్, కార్యదర్శి సిహెచ్.రమేష్, రెడ్ క్రాస్ సభ్యుడు పి.నాగరాజు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు సీహెచ్.ఐలయ్య, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్చార్జ్ నాగేంద్ర, సీనియర్ సహాయకులు గణేష్, తదితరులు పాల్గొన్నారు.






