బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ములుగు, జనవరి 10, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో 38మంది పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల యాజ మాన్యులు డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ రెడ్డి విచ్చేసి ఉపాధ్యాయులుగా మారి న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ కొలగాని రజనీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులలో బాధ్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, విద్యా బోధనపై అవగాహన కల్పించడానికి స్వయం పరిపాలన దినోత్సవం ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులలో ప్రిన్సిపల్ గా గమన స్వేచ్ఛ, డీఈవోగా హృషికృష్ణ, డిప్యూటీ డి ఈ ఓ గా సాయి నివాస్, ఎంఈఓ గా రెడ్డి పవన్, మరి కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. కార్యక్రమానంతరం బోధనలో ప్రతిభ చాటిన విద్యార్థు లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, ట్రెజరరీ వనజ మేడం, అబ్జర్వర్ శ్రీధర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయు లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






