గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం

On: January 7, 2026 8:04 PM

గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం

గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం

పేద విద్యార్థులకు దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ

వెంకటాపురం (నూగూరు), జనవరి 7 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన గ్రామాల్లో సేవా భావం వెల్లువిరిసింది. ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్లు, ఆటబొమ్మలు పంపిణీ చేశారు. వెంకటాపురం మండలంలోని జెల్ల కాలనీ, టేకులబోరు, మంగవాయి, ముక్కునురుపాలెం, రామచంద్రపురం, మొర్రవానిగూడెం, ఆలుబాక, బర్రెబొంద, ఎదిర గ్రామాల్లోని జీఎస్‌ఎస్ చైల్డ్ కేర్ సెంటర్లలో చదువుతున్న సుమారు 800 మంది నిరుపేద విద్యార్థులకు ఈ సహాయం అందించారు. మొర్రవానిగూడెం జీఎస్‌ఎస్ చైల్డ్ కేర్ సెంటర్‌లో పాఠశాల ఉపాధ్యాయులు దిలీప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు ఉచితంగా ట్యూషన్ అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉజ్వల బాట వేస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ సేవలను తల్లిదండ్రులు హర్షాతిరేకాలతో అభినందించారు. పల్లె ప్రాంతాల్లో పేద విద్యార్థుల పట్ల ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు మురళీ కృష్ణారెడ్డి, రాము, సతీష్, చైల్డ్ కేర్ సెంటర్ సిబ్బంది ముర్రం రాజేష్, సోలోమోన్, జయరాజు, రామ్మూర్తి, యోసేపు, బాబు, సుధాకర్‌లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!