వెంకటాపురం ఏజెన్సీలో ఎల్టీఆర్ చట్టానికి తూట్లు

On: January 4, 2026 5:14 PM

వెంకటాపురం ఏజెన్సీలో ఎల్టీఆర్ చట్టానికి తూట్లు

వెంకటాపురం ఏజెన్సీలో ఎల్టీఆర్ చట్టానికి తూట్లు

అక్రమార్కులపై అధికారులు నిఘా పెట్టాలి

– గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్

వెంకటాపురం నూగూరు, జనవరి 5 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమ భవన నిర్మాణాలు, గిరిజనేతరుల చేతుల్లో భూముల క్రయవిక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, దీనిపై అధికారులు నిమ్మకు నెరెత్తినట్లుగా వ్యవహరించడం తీవ్ర ఆందోళనకరమని పూనెం ప్రతాప్ మండిపడ్డారు. ఆదివారం మండలంలోని ఆదివాసీ గ్రామాలను పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెంకటాపురం మండల కేంద్రంగా గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు బెల్లం కొట్టే రాయి లాగా మౌనంగా ఉండటం సరికాదన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 244 ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో అమల్లో ఉన్న ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్–1939 (ఎల్టీఆర్)తో పాటు దాని అనుబంధ చట్టాలు 1/59, 1/70 వంటి పటిష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ లక్షల రూపాయలతో భూముల లావాదేవీలు సాగుతున్నాయని విమర్శించారు. చట్టాల లోపాలను ఆసరాగా చేసుకుని గిరిజనేతరులు భూములు పొందుతున్నారా? అన్న ప్రశ్నను అధికార యంత్రాంగానికి నేరుగా విసిరారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు మళ్లీ అడవులకే వెళ్లి నివసించే పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వెంకటాపురం మండల కేంద్రంలో జరుగుతున్న గిరిజనేతరుల భూముల క్రయవిక్రయాలు, కొత్త భవన నిర్మాణాలను నిలిపివేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పర్శిక అనిల్, నవీన్, ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!