భద్రాచలం గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి.
- ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన వాజేడు మండలం.
- భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదివారం దీపావళి పండుగ పర్వదినం రోజు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మండలంలో సుమారు 8 పంచాయతీలపైగా పర్యటించిన బి.ఆర్.ఎస్ ఎన్నికల ప్రచారం బృందం ఆదివారం గుమ్మడిదొడ్డి గ్రామం నుండి అనేక గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది ఎన్నికల ప్రచార రథాలకు, సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరై జేజేలు పలికారు. అనేక చోట్ల మహిళలు, కార్యకర్తలు తమ ప్రియతమ నేత అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట రావుకు పూలవర్సాలు కురిపించి, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలపరుస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు, ఓటర్లు బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి, కారు గుర్తు ను గెలిపించుకుంటామని ప్రతిపక్ష పార్టీల దొంగ హామీలను నమ్మే పరిస్థితి, ప్రసక్తి లేదని ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు హర్షద్వానాల మధ్య, కారు గుర్తుకే ఓటు అంటూ నినాదాలు చేశారు. గుమ్మడి దొడ్డి, జగన్నాధపురం, పాయబాట్ల కొంగాల , మొరుమూరు, ప్రగళ్లపల్లి, ఏడుచర్ల పల్లి పూసూరు ఇంకా పలు గ్రామాలలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ఎన్నికల ప్రచారాల్లో సుడిగాలి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పార్టీ అభ్యర్థి డాక్టర్ వెంకటరావు కు రైతులు, వ్యవసాయ కూలీలు, పలువురు స్వాగతాలు పలుకుతూ, కారు గుర్తును గెలిపించుకుంటామని అభివాదాలు చేస్తూ జై బీఆర్ఎస్ జై జై బీఆర్ఎస్ కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సాంస్కృతిక కళా బృందాలు ప్రదర్శనలు తో, ఓటర్లను ఉత్సాహపరిచి, కళాకారులు ఓటర్లు ను ఆకట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేయొద్దని, ఏకగ్రీవ తీర్మానంతో జై కేసీఆర్, జై జై కెసిఆర్ అంటూ కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనేక గ్రామదేవతలకు ఆయా గ్రామాల్లో ఆగి అబ్యర్ది డాక్ట ర్ తెల్లం పూజలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో వందలాదిమంది వివిధ పార్టీలకు చెందిన వారు గులాబీ కండువాలు కప్పు కున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, వాజేడు పోలీసులు విస్తృతమైన బందోబస్తు నిర్వహించారు. సివిల్ మరియు సిఆర్పిఎఫ్ బృందం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కన్వీనర్ బోదె బోఇన బుచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు పి. రామకృష్ణారెడ్డి, జడ్పిటిసి తల్లాడి పుష్ప లత , పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీల నాయకులు సత్యనారాయణ, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.