Elections | మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరిన బిజెపి నేత తాటి కృష్ణ
తెలంగాణ జ్యోతి, నవంబర్ 12, ములుగు ప్రతినిధి : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ ల సమక్షంలో బీఆర్ఎస్ లో ములుగు జిల్లా బీజేపీ నేత తాటి కృష్ణ, ఓదెల జడ్పిటిసి రాములు యాదవ్ లు చేరగా ఈ సందర్భంగా వారందరికీ మంత్రులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగిందన్నారు. ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసామనీ, బీఆర్ ఎస్ అభ్యర్థి బడే నాగ జ్యోతి గెలుపు కోసం మనం అందరం కంకణ బద్ధులమై పని చేయాలన్నారు. ములుగు లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ములుగును జిల్లా చేసిన ఘనత సిఎం కెసిఆర్ దనీ, సమ్మక్క,సారక్క జాతర ను పెద్ద యెత్తున కేసిఆర్ నిర్వహిస్తున్నారన్నారు. ములుగు అభ్యర్థిగా నాగజ్యోతికి ఊహించని విధంగా ఆదరణ పెరిగుతుందనీ, నామినేషన్ రోజు మండుటెండలో 25 వేల మందికి పైగా ర్యాలీగా తరలివచ్చారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఏం చెప్పిన ప్రజల నమ్మరు. రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. సీతక్క సోషల్ మీడియా లో మాత్రమే ఉంటారు. ములుగు అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. నిరుపేద అమ్మాయి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలనీ కోరారు. సీతక్క కు ఓడిపోటమి భయం పట్టుకుందనీ, ఓటమి అంచుల్లో ఉన్న ఆమెకు ఏం మాట్లాడాలో అర్థంకావడంలేద న్నారు. రానున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌దే, ములుగు అభివృద్ధి బి ఆర్ ఎస్ తోనే సాధ్యమన్నారు.
2 thoughts on “Elections | మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరిన బిజెపి నేత తాటి కృష్ణ”