జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ
ములుగు, డిసెంబర్31, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా, జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల బాలు జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో సాగుతున్న (ఎస్ఎఫ్ఐ) 1970 డిసెంబర్ 30న కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో “చదువుతూ పోరాడు – చదువుకై పోరాడు నినాదంతో ఆవిర్భవించిందని, గత 55 సంవత్సరా లుగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విద్యా రంగంలో అనేక విజయాలు, మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు; ఈ ఉద్యమ కాలంలో అనేక మంది విద్యార్థులు అమరులయ్యారని గుర్తు చేస్తూ, నేటికీ విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు మరియు ప్రభుత్వాలు విద్యారంగానికి తగిన నిధులు కేటాయించి ఆధునీకరణ చర్యలు చేపట్టినప్పుడే విద్య వ్యవస్థ గాడిలో పడుతుందని స్పష్టం చేశారు; ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చందు, సిద్దు, సాయి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.








