గారేపల్లి లో ఘనంగా అయ్యప్ప స్వామి అరట్టు శోభా రథయాత్ర

On: December 26, 2025 10:56 AM

గారేపల్లి లో ఘనంగా అయ్యప్ప స్వామి అరట్టు శోభా రథయాత్ర

గారేపల్లి లో ఘనంగా అయ్యప్ప స్వామి అరట్టు శోభా రథయాత్ర

కాటారం, డిసెంబర్ 26, (తెలంగాణ జ్యోతి): మండలం లోని గారేపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి శోభ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామియే శరణమయ్యప్ప…శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష స్వాములు శరణు ఘోష చేస్తూ దీక్షా స్వాములు ఉత్సవ మూర్తులు కొలువుదీరిన రథాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు ప్రజలు ఇంటి నుండి మంగళ హారతులతో స్వాగతం పలికారు. టెంకాయ కొట్టి మొక్కుబడులు సమర్పించారు. దీక్ష తీసుకున్న స్వాములు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా డీజే భక్తి పాటలకు నృత్యాలు చేశారు. 353 సి కాటారం-వరంగల్ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి భక్తి కీర్తనలకు చిన్నారులు చేసిన నృత్యం సంస్కృతిక ప్రదర్శన పలువురుని ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వహించిన అనంతరం రథం లో పూజలు చేసి అరటు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు జీవిశాస్త్రి, ఆలయ పురోహితులు భాను ప్రసాద్, శ్రీఆనంద ధర్మశాస్త్ర దేవాలయ శాశ్వత కమిటీ చైర్మన్ బచ్చు అశోక్, గురుస్వాములు, దీక్షా స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!