గుండెపోటుతో నాగయ్య మృతి
ములుగు, డిసెంబర్ 23, తెలంగాణజ్యోతి : ములుగు మండలం బంజర పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం నాగయ్య (51) మంగళవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం ఇంట్లో అందరితో కలిసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తెలిపారు. వెంటనే చికిత్స కోసం ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు. మృతునికి భార్య నాగమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాగయ్య ఆకస్మిక మరణంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.





