ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
హనుమకొండ, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : ఫిజీషియన్స్ డే సంద ర్భంగా యశోద హాస్పిటల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ జిల్లా గోపాల్పూర్‌లోని సిరి స్పెషాలిటీ క్లినిక్ అండ్ డయాబెటిస్ సెంటర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ బింగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మొత్తం 160 మందికి ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వైద్య సేవలందించిన డాక్టర్లను పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరి స్పెషాలిటీ క్లినిక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బి. దుర్గాప్రసాద్, యశోద హాస్పిటల్ వైద్యులు సాయి దుర్గ, అఖిల్, అనిల్, గంగయ్యతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






