22న ములుగులో జిల్లా అథ్లెటిక్స్ ట్రయల్స్
ములుగు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 22న ములుగు పట్టణంలో అథ్లెటిక్స్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. 16, 18, 20 సంవత్సరాల లోపు బాలబాలికలతో పాటు పురుషులు, మహిళల విభాగాల్లో ట్రయల్స్ నిర్వహించి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ట్రయల్స్‌కు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.






