ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రతీ విద్యార్థికి తప్పనిసరి

On: November 15, 2025 12:52 PM
ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రతీ విద్యార్థికి తప్పనిసరి

ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రతీ విద్యార్థికి తప్పనిసరి

– జిల్లా ప్రణాళిక సమన్వయ అధికారి అర్షం రాజు

ములుగు ప్రతినిధి, నవంబర్12, తెలంగాణ జ్యోతి : ప్రతీ విద్యార్థికి ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరి అని జిల్లా ప్రణాళిక సమన్వయ అధికారి అర్షం రాజు అన్నారు. బుధవారం ములుగులోని బిట్స్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విద్యార్థుల ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారుల ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలని, 15ఏళ్ల పైబడిన విద్యార్థులు ఎంబీయూ–2 చేయించు కోవాలని సూచించారు. జీవ వైజ్ఞానిక వివరాలు నవీకరించని పక్షంలో ఆధార్ సంఖ్యలు క్రియాశీలం కావని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాలను విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక వినియోగించు కోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి విద్యార్థి తమ ఆధార్ జిరాక్స్ తో శిబిరానికి హాజరుకావాలన్నారు. ప్రస్తుతం ములుగు మండలంలో మూడు ఆధార్ శిబిరాలు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ఒక్కో ఆధార్ శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధార్ సమన్వయ అధికారి సాయిరాం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment