సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
– మహాదేవపూర్ బ్లాగ్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు
కాటారం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలో మొదటిసారిగా ఈనెల 15 నుండి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతి నదీ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించినం దుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కాంగ్రెస్ పార్టీ పక్షాన మహాదేవ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు కృతజ్ఞతలు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ లు చూపిన చొరవ ప్రత్యేక కృషి అభివృద్ధి కోసం రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం పట్ల కోట రాజబాబు కృతజ్ఞతలు తెలిపారు. సరస్వతి పుష్కరాలు విజయవంతంలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయులకు, భక్తులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు విధుల నిర్వహణలో నిబద్ధత, సమగ్ర ప్రణాళిక, అవిశ్రాంత కృషి వల్ల 30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి క్షేమంగా ఇంటికి చేరినట్లు తెలిపారు ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తా మని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సరస్వతి పుష్కరాలు నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ ద్వారా శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.