సరస్వతి పుష్కరాలు విజయవంతం
– కలెక్టర్ అభినందనలు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో ఈనెల 15 నుండి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతి నదీ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించినందుకు భాగస్వాములైన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయులకు, భక్తులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో నిబద్ధత, సమగ్ర ప్రణాళిక, అవిశ్రాంత కృషి వల్ల లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి వారందరి మన్ననలు పొందారని అన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మన జిల్లా పరిపాలనా సామర్థ్యాన్ని, ఐక్యతను నిరూపించుకున్నామని తెలిపారు. పుష్కరాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన పాత్రికేయులను అభినందిం చారు. లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇంతటి సమిష్టి బాధ్యతతో నిర్వహించిన ఈ పుష్కరాలు మన భవిష్యత్తు కార్యాచరణకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కోన్నారు. ఇదే స్ఫూర్తితో సేవా ధృక్పదాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.