మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

– యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి.

– అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి.

ములుగుప్రతినిధి,తెలంగాణ జ్యోతి: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి. అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని, విద్యార్థులకు అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటు చేసి పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశిం చారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. రానున్న రోజుల్లో మాధకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ నిర్ధారణ కిట్లను తెప్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకున్న చర్యలను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి డి ఎస్ బి కిషోర్, మాదకద్రవ్య ఎస్ ఐ సురేష్, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, సూపరింటెండెంట్ జగదీశ్వర్, బిసి డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, జిల్లా మైనారిటీ వాల్ఫేర్ ఆఫీసర్, జిల్లా నిషేధం & ఎక్సైజ్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment