పుష్కరాల భక్తులకు 12 రోజులుగా అన్నదానం చేయడం అభినందనీయం

పుష్కరాల భక్తులకు 12 రోజులుగా అన్నదానం చేయడం అభినందనీయం

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తుల కు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినంద నీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినంద నీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment