క్రీడాకారులు శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మాజీఎంపీపీ పంతకాని సమ్మయ్య
కాటారం,తెలంగాణజ్యోతి:క్రీడాకారుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం వేసవిలో యిస్తున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో తమ ప్రతిభను చాటాలని మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. సోమవారం కాటారం ట్రైబల్ వెల్ఫేర్ లో పాఠశాలలో గతనెల రోజులుగా జిల్లా స్థాయి అథ్లెటిక్ శిబిరం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న జూనియర్, సబ్ జూనియర్, అథ్లెటిక్, క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల తో కాటారం మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పులిహోర,వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొన్నారు. ప్రతి క్రీడాకారుడు, ప్రతిభ కనబరిచి, తల్లిదండ్రు లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు మంత్రి జిల్లా శ్రీధర్ బాబు తద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నాయిని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సమ్మయ్య, మిషన్ రాజయ్య, పున్నమి రమేష్, గంట దేవదాసు, మద్ది సంపత్ పాల్గొన్నారు.