రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు
తెలంగాణజ్యోతి, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రాజీవ్ యువవికాస పథకానికి ధరఖాస్తు చేసుకున్న యువతకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు, మండల అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్ లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం ఎస్బిఐ బ్యాంకు, డిసిసిబి బ్యాంకుల అధికారులు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని ఎంపీడీవో తెలిపారు. వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రాజీవ్ యువవికాస దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నది.