ప్రోటో కాల్ పై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య

ప్రోటో కాల్ పై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య

కాటారం, తెలంగాణ జ్యోతి : పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రోటోకాల్ అంశంపై పుట్ట మధు, టిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య తీవ్రంగా ఖండించారు. కాటారం మండల కేంద్రంలో మీడియా సమావేశం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ మాట్లాడుతూ వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు, కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కర ఉత్సవాల్లో టెండర్ తీసుకున్న సంస్థలు ఫ్లెక్సీలలో ఫోటోలు ఏర్పాటు చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబు ను ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని మాట్లాడే పుట్ట మధుకర్ గారు టిఆర్ఎస్ పాలనలో దళిత జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ప్రోటోకాల్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నాం. అడుగడుగునా అవమానాలకు గురిచేస్తూ నాడు ఐదు మండలాలలో శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి నీ పేరు పెట్టించు కున్నది నిజం కాదని అడుగుతున్నాం. భూపాలపల్లి నియోజక వర్గ ఆరు మండలాలలో కనీసం ప్రోటోకాల్, ఫోటో, క్యాంప్ ఆఫీస్ లేకుండా చేసిన మీ నాయకులను ఎందుకు ప్రశ్నించలేని అడుగుతున్నాం. కేసిఆర్ కేటీఆర్ మీకు అపాయింట్మెంట్ ఇయ్యనప్పుడు భారత రాజ్యాంగం గుర్తు రాలేదా అని అడిగారు. గోదావరిఖని సమావేశంలో వేదిక పైకి పిలవకపోతే వేదిక కింద కూర్చున్నప్పుడు ప్రోటోకాల్ గుర్తు రాలేదని అడుగుతున్నాం. నా పేరు పలుకుతలేరని అడిగే ముందు మీ గత చరిత్ర తెలుసుకోవాలని,రాజ్యాంగబద్ధంగా న్యాయ వాదు లైన వామన్ రావు దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసి పోలీసులు అరెస్టు చేస్తారని పారిపోయిన నాయకుడిని రాజ్యాంగం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. నామినేటెడ్ పదవుల్లో దళితులకు గిరిజనులకు ఇవ్వకపోగా అడిగినందుకు మహ ముత్తారం గిరిజన నాయకుని పై దాడి చేసింది నిజం కాదని, మంథని నియోజకవర్గంలో కవిరాజు, మంథని మధుకర్, రేవెల్లి రాజబాబు, లింగయ్య, లాంటి అనేకమంది దళిత గిరిజన ఆదివాసీల మీద అరాచకాలు జరిగినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదని నిలదీశారు. పుష్కరాల విజయవంతానికి అధికార యంత్రాంగం అంతా కృషి చేస్తుంటే, భక్తులంతా క్షేమంగా వెళ్లి పుష్కర స్నానం దర్శనాలు చేసుకొని వస్తుంటే,ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీపై బి ఆర్ ఎస్ నాయకులకు ప్రేమ ఎందుకో తెలపాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల రక్తం,చెమట చుక్కలతో గెలిచిన ఎంపీ ఏ ఒక్కరోజు సామాన్యులకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకున్నా,కాక పై ఉన్న గౌరవంతో అభిమానించుకుంటున్నాం.. మేము కట్టే ప్రతి ఫ్లెక్సీలో, ప్రతి కార్యక్రమంలో వారి పేరు పెట్టి, ఫోటో పెట్టి గౌరవించుకుంటున్న సంగతి తెలుసుకోవాలని కోరుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, పదవి పోయినంక గుర్తుకు వస్తుంది. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలంతా శ్రీధర్ బాబు గారిని ఆదర్శ ఆదరిస్తున్నారు అంటే అర్థం చేసుకొని రాజకీయాల నుండి తప్పుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, ఆత్మకూరి కుమార్ యాదవ్, బిరెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment