Miss World | ప్రపంచ సుందరీమణుల రామప్ప సందర్శన సక్సెస్ చేయాలి
– సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు
– ఆఫీసర్లతో రివ్యూలో కలెక్టర్ దివాకర టీఎస్
– వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
ములుగు, తెలంగాణ జ్యోతి : చారిత్రాత్మకమైన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయ సందర్శనకు వస్తున్న ప్రపంచ సుందరీమణులకు వైభవంగా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ములుగు కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్, అదను కలెక్టర్ మహేందర్ జీలతో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీ మణులు ఈనెల 14న రామప్పను సందర్శిస్తున్న నేపథ్యంలో అబ్బుర పడేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, రూట్ మ్యాప్ కు అనుగునంగా ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. సుమారు 35మంది ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్ తో రూపొందించిన ఏసీ బస్సుల్లో రామప్పకు నేరుగా చేరుకుంటారని తెలిపారు. కాకతీయుల ఆలయాన్ని సందర్శించే క్రమంలో ఎలాంటి అసౌకర్యం కలుగొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవానల్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే చోట కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఆలయ పరిసర ప్రాంతా ల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. ఆయా విభాగా ల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరించి సమన్వయంతో తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. సుందరిమణుల పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రామప్ప ఆలయ సందర్శన ప్రపంచ సుందరీమణులకు ఒక తీపి జ్ఞాపకం గా ఉండాలని, ఆ మేరకు అధికారులు సకల ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచిం చారు. అధికారులు తమకు కేటాయించి సీట్లలో ముందుగానే కూర్చోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ మాట్లాడుతూ ప్రపంచ సుందరీ మణుల సందర్శన నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక అడిషన ల్ ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 127మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 360 మంది కానిస్టేబుల్ లు, 160 మంది మహిళా కానిస్టేబుళ్లు, 54 మంది హోంగార్డులు, 113 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, 125 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ లు మొత్తం వెయ్యి మంది అధికారులు మరియు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.