Seetakka | మాట ఇస్తే తప్పుకునేదే లేదు

Seetakka | మాట ఇస్తే తప్పుకునేదే లేదు

Seetakka | మాట ఇస్తే తప్పుకునేదే లేదు

 – నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

– ప్రతి పనినీ చిత్తశుద్ధితో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం

– రాష్ట్ర మంత్రి సీతక్క

– మంగపేటలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

– వైభవంగా శ్రీ హేమాచెల లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణం

–పట్టు వస్త్రాలు, ముత్యాల తళంబ్రాలు సమర్పించిన మంత్రి సీతక్క 

ములుగు, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోని ప్రజలకు ప్రజా పాలన ప్రభుత్వం ప్రతీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పూర్తి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనగకుంట గ్రామంలో అగ్నిమాపక బాధితులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదంలో శనిగకుంటలోని కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోగా తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధితకుటుంబాలకు వంట సామాన్లతో పాటు బట్టలను అందజేయడం జరిగిందని, 300 స్వచ్ఛంద సంస్థలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించడం జరిగిందని వివరించారు. అగ్నిమాపక బాధితులు ధైర్యం కోల్పో కుండా ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రత్యేక సహాయ కార్యక్ర మాలు చేపట్టడంతో పాటు ఐటిడిఏ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ముఖ్యంగా మంచినీటి ఎద్దడిని నివారించడానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతుందని, గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం సంతోషం కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ మంచి నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని చర్యలు తీసుకుంటున్నామని, పరిపాలన కేంద్రంగా ఉంటున్న ఐటీడీఏలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాని పేదలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండవ దఫాలో ఇండ్లను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న లబ్ధిదారులకు త్వరిత గతిన బిల్లులు చెల్లించడానికి కలెక్టర్ చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడు తూ శనిగకుంట గ్రామంలో నీటి సమస్య ఉన్న కారణంగా గ్రామస్తులు నీటిని నిలువ చేసుకొని సేవించడం వలన అనేక వ్యాధుల బారిన పడ్డారని, మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో మంచినీటి సమస్యను తీర్చామని అన్నారు. వరద ముప్పు, అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ,తాసిల్దార్ రవీందర్,ఎంపీడీవో, ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

–వైభవంగా మల్లూరు శ్రీ హేమాచెల లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణం

– పట్టు వస్త్రాలు, ముత్యాల తళంబ్రాలు సమర్పించిన మంత్రి సీతక్క 

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి తిరుకళ్యాణ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తళంబ్రాలను సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి కంచర్ల గోపన్న వారసులు కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాఉడుతూ.. రానున్న రోజులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అను కున్న స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ప్రస్తుతం జరుగు తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. పలు రకాల వసతులను కల్పించడం జరిగిందని, నిత్యం భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొ ని భక్తులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర దివాకర టీఎస్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, సంబంధిత అధికారులు, ఆలయ పూజారులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment