ఐలాపూర్ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

ఐలాపూర్ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

ఐలాపూర్ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

        తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ సమ్మక్క సారలమ్మలను, ఏటూరునాగారం మండలంలోని గోవిందరాజులు, నాగులమ్మ  జాతరలను   రాష్ట్రపంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి  సీతక్క హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన దేవతలుగా కొలువబడే సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై, ఈ ప్రజా ప్రభుత్వం పై ఉండాలని, కోరిన కోర్కెలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మేడారం, కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేట జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాబోయే జాతర లోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment