నూతన ఇసుక పాలసిలో గిరిజన సొసైటీలకు అన్యాయం జరుగుతే యుద్ధమే..
– ఆదివాసీ మహిళ రాష్ట్ర నాయకురాలు అట్టం.సుభద్ర
నూగురు వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : నూతన ఇసుక పాలసీలో గిరిజన సొసైటీలకు అన్యాయం జరుగుతే యుద్ధమేనని ఆదివాసి మహిళ రాష్ట్ర నాయకురాలు అట్టం సుభద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా సింగిల్ టెండర్ విదానంతో ఏజెన్సీ ప్రాంతంలోని సహజ సంపద ఇసుకను అక్రమంగా తొలకపోవాలని చూస్తే ఆదివాసీలు చూస్తూ ఊరుకోరని, 5 వ షెడ్యూల్ భూభాగంలో గిరిజన చట్టాలను కాదని పేసా చట్టాన్ని వంచిచే విదంగా ప్రభుత్వం పాల్పడితే ప్రభుత్వం పై ఎంతటి ఉద్యమాని కైనా వెనుకడుగు వేసేది లేదన్నారు. జల్ జంగిల్ జమీన్ పోరాటాన్ని మొదలు పెడతామన్నారు. ప్రభుత్వానికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల అభివృద్ధినే కోరితే ఎప్పుడో తెచ్చిన పాత పాలసీని కాదని, నూతన ఇసుక పాలసిలో లోడింగ్ రేటు 4,500 ఒక క్యూబిక్ మీటర్ ఇసుకకు, 500 రూపాయలు డంపింగ్ ఒక ఎకరానికి 80,000 వేల రూపాయలు కౌలు ఇవ్వాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ టెండర్ విదానం ద్వారా ఆదివాసీల కోట్ల సంపదను దోచుకున్నదని గుర్తు చేశారు . ఇసుక అమ్మకాలలో ఒక క్యూబిక్ మీటర్ ఇసుకకు 650 రూపాయలకు అమ్మితే గిరిజన సొసైటీలకు కేవలం 220 రూపాయలు మాత్రమే ఇచ్చి ఎక్కువ డబ్బులు దోచుకుంటున్నదే ప్రభుత్వమని, గిరిజనుల సంపద దోచుకోవడానికేనా ప్రభుత్వం అని ప్రశ్నించారు. రైజింగ్ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని నింద వేసే కుట్రలు చేస్తున్నదని, ప్రభుత్వం కుటిల కుట్రలు చేస్తే తిప్పికొడతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్తామన్నారు.
1 thought on “నూతన ఇసుక పాలసిలో గిరిజన సొసైటీలకు అన్యాయం జరుగుతే యుద్ధమే..”