ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : సిఐ ఈవూరి నాగార్జున రావు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్ ను అందరు పాటించాలని కాటారం సిఐ ఈవూరి నాగార్జున రావు, ఎస్సై మ్యాక అభినవ్ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్స వాలలో భాగంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొబెషనరీ ఎస్ఐ హేమలతతో పాటు సిఐ, ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రహదారి భద్రత నియమాలను పాటించాలని సూచించారు. తాగి వాహనాలు నడిపినట్లు అయితే చర్యలు తీసుకుంటామ న్నారు. పరిమితికి మించి వాహనాలలో ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. రహదారి భద్రత నియమాలను డ్రైవరు తూచా తప్పకుండా పాటించాలని కోరారు.