బీజేపీ కాటారం మండల అధ్యక్షునిగా పాగె రంజిత్ కుమార్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : బీజేపీ కాటారం మండల అధ్యక్షుడుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన పాగె రంజిత్ కుమార్ ఎన్నికైనట్లు బీజేపీ పెద్దపల్లి సంస్థగత ఎన్నికల అధికారి అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రు పట్ల సునీల్ రెడ్డి ప్రకటించారు. రంజిత్ గతంలో విద్యార్థి దశ లో ఏబీవీపీ నాయకుని గా జిల్లా రాష్ట్ర స్థాయి లో అనేక భాద్యతలు నిర్వహించి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈ సంద ర్బంగా నూతనంగా ఎన్నిక అయినా పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి, ఎన్నికల అధికారి భూమయ్య కు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి,రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి కి, మండల్ ఎన్నికల అధికారి పిల్లల మర్రి సంపత్ కి సీనియర్ నాయకులకు, భూత్ అధ్యక్షులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు.