ఇష్టారాజ్యంగా ఇండ్ల సర్వేలు చేస్తున్న గ్రామ సిబ్బంది
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇష్టారాజ్యంగా సర్వేలు చేపడుతున్నారని స్థానిక ప్రజ లు ఆరోపిస్తున్నారు. మండలంలోని గుర్రెవుల, రాజన్నపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది వారికి సంబంధించిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగత వారికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంటి తర్వాత మరొక ఇంటిని సర్వే చేయాలి కానీ, ఇక్కడ ఇలా చేయకపోవడంపై వారికి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.