ఆత్మ విశ్వాసంతో ఆటలు ఆడాలి : దుద్దిల్ల శ్రీనుబాబు

ఆత్మ విశ్వాసంతో ఆటలు ఆడాలి : దుద్దిల్ల శ్రీనుబాబు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో ఆటలు ఆడాలని దుద్దిల్ల శ్రీపాదరావు చారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహోదరుడు, దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి సువిద్య పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షటిల్ టోర్న మెంట్ను శ్రీనుబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడాకారులు తమ ఊరికి సేవ చేయాలని, క్రీడలలో గెలుపోటములు సహజమన్నారు. క్రీడలు పోరాట పటిమను పటిష్ట పరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చీమల సందీప్, మహిళ విభాగం అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, సువిద్య పాఠశాల చైర్మన్ కొట్టే శ్రీశైలం తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఒక్కొక్కరిని వ్యక్తి గతంగా కలుస్తూ కరచాలనం చేసీ శ్రీనుబాబు పరిచయ కార్య క్రమం ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment