వెంకటాపురం శివాలయంలో శివ స్వాముల ఇరుముడుల సందడి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం శివ స్వాముల ఇరుముడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీక్షాపరులైన శివ స్వాములను పుణ్య క్షేత్రాలకు సాగనంపారు. ఈ సందర్భంగా దేవాలయం లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శివ స్వాముల ఇరుముడి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. శివ స్వాముల గురుస్వామి అయిన రాజేంద్రప్రసాద్ స్వామి శివ స్వాములకు స్వామి వారి నామ స్మరణల మధ్య ఇరుముడి కార్యక్రమాలను నిర్వహించారు.