ములుగు జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మార్చుదాం…
– అవినీతిని తరిమేద్దాం దేశాభ్యుదయానికి పునాదులు వేద్దాం.
– డిసెంబర్ 3 నుండి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు.
– ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064.
– ఎవరైనా లంచం అడిగితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.
వరంగల్ రేంజ్ 9154388912 : జిల్లా కలెక్టర్ దివాకర
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అవినీతి నిరోధక శాఖకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అవినీతి నిరోధక వారోత్సవాల కర పత్రము, పోస్టర్, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏసీబీ సి ఐ తో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో అవినీతిని తరిమేసి దేశాన్ని అభివృద్ధిపధం లో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ములుగు జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు ఏసీబీ అధికా రులకు సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా లో డిసెంబర్ 3 నుండి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిం చడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఇవ్వవద్దని, లంచం ఇవ్వాలని అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు లేదా వరంగల్ రేంజ్ ఏసీబీ ఫోన్ నెంబర్ 9154388912 కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, వరంగల్ రేంజ్ ఏసీబీ సి ఐ రాజు, ఇతర అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.