మెనూ ప్రకారంగా ఆహారం క్వాలిటీ, క్వాంటిటీ పాటించాలి
– భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: వసతి గృహాల విద్యార్థులకు అందించే మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటిం చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సి, బిసి బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సౌకర్యాలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులకు గీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కోరగా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే టీ సౌకర్యం కల్పించడంతో పాటు, పోషకాహారం సరిపడా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు గ్రంథాల యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబా టులో ఉంచాలని కోరగా, అవసరమైన అన్ని పుస్తకాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, కావాల్సిన పుస్తకాలు వివరాలు జాభితా ఇవ్వాలని కలెక్టర్ విద్యార్థుల సూచిం చారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమి చదువు తున్నారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బం గా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూడా లని, బియ్యం, సరుకులు నాణ్యత లేకుంటే తక్షణమే మార్చా లని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఎస్సి హాస్టల్ లో సిసి కెమెరాను పరిశీలించారు. మెనూ పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి శైలజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమణా రావు, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.