అయ్యప్ప స్వామి విగ్రహం బహుకరణ
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పలు గ్రామాలలో నిర్వహించే మహా పడి పూజలకు ఉపయోగించడానికి కాటారం అయ్యప్ప స్వామి దేవాలయం వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త, గురు స్వామి బచ్చు అశోక్ గుప్తా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన మహాదే వపూర్ మండలం అయ్యప్ప స్వామి గురు స్వామి గుడాల శ్రీనివాస్ కు అందజేశారు.ఈ విగ్రహాన్ని మహాదేవపూర్ మండ లంలోని పలు గ్రామాలలో నిర్వహించే అయ్యప్ప స్వామి పడి పూజలకు ఉపయోగించాలని సూచించారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని బహుకరించిన బచ్చు అశోక్ దంపతులకు మహాదేవపూర్ మండలం అయ్యప్ప స్వామి భక్త బృందం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బచ్చు అశోక్ గుప్తా, గుడాల శ్రీనివాస్, చల్లా తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.