అథ్లెటిక్ పోటీలో సత్తా చాటిన సన్ రైజర్స్ స్కూల్ విద్యార్థులు

Written by telangana jyothi

Published on:

అథ్లెటిక్ పోటీలో సత్తా చాటిన సన్ రైజర్స్ స్కూల్ విద్యార్థులు

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రం లోని సన్ రైజర్స్ స్కూల్ విద్యార్థులు 10 వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటారు. జాకారంలో 24న జరిగిన ములుగు డిస్టిక్ సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ అండర్-12 లో కె. నేహ 6 వ తరగతి జావెలిన్ త్రో & షాట్ ఫుట్ లో గోల్డ్ మెడల్, ఎస్ అవంతిక 5 వతరగతి అండర్ 12 జావెలిన్ త్రో,లాంగ్ జంప్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెట్టెం రాజు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బలుగూరి జనార్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు డి ప్రభు కిరణ్, సురేష్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now