రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం
– ధాన్యం కొనుగోలు పక్రియపై ఆరోపణలు అవాస్తవం
– రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మిల్లర్స్ కి సహకరించాలి
– రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్
ములుగుప్రతినిధి :రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయ మని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే రైతుల ధాన్యాన్ని మిల్లుల్లో దింపుకోవడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పక్రియ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవ మని పేర్కొన్నారు. అక్కడక్కడ కొందరు రైతులకు తప్పడు సాంకేతలు ఇవ్వడం సరికాదని అన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి జిల్లాలో ని రైస్ మిల్లర్స్ కి సాకరించా లని కోరారు. వరి పంట కోసిన వెంటనే ధాన్యం ను అరబెట్టు కోవాలని సూచించారు. ముఖ్యంగా సన్న రకం ధాన్యం లో తాలు లేకుండా చూడటం తో తేమ శాతం 14శాతం నుండి 17 శాతం లోపు ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రం కి తరలిం చాలని సూచించారు. అదేవిదంగా దొడ్డు రకం ధాన్యం లో సైతం తాలు లేకుండా చూడటం తో పాటు తేమ శాతం 17శాతం లోపు ఉండే విధంగా చూడాలని అన్నారు. అలా రైతు లు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే జిల్లా లోని రైస్ మిల్లర్స్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని తెలిపారు. సన్న ధాన్యం 1 క్వింటా వడ్లకి 67 కిలోల బియ్యం చొప్పున మిల్లర్స్ ప్రభుత్వం కు ఇవ్వాలని పేర్కొన్నారు. మాములుగా 1క్వింటా కి 60 కిలోల బియ్యం రావడమే కష్టమైన పరిస్థితి అలాంటిది 67 కిలోల చొప్పున ప్రభుత్వం కి మిల్లర్స్ బియ్యం అప్పగించాలని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో మిల్లర్స్ సమస్యలను రైతు లు అర్ధం చేసుకొని నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. గతంలో మన ధాన్యం ను పక్క జిల్లాకి తిసుకెళ్తే క్వింటా కి 10 నుండి 15కిలోల చొప్పున కట్టింగ్ చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. అలాంటి పరిస్థితి ఈ యేడాది మన రైతు లకు ఎదురు కాకుండా ఉండేందుకుగాను ధాన్యం ను ఎక్కువ గా మన జిల్లా లోనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కావున, రైతు లు సైతం తగు జాగ్రత్తలు తీసుకొని అటు సెంటర్ నిర్వహించే వారికి ఇటు మిల్లర్స్ కి సాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో కొంతమంది రైతులు కె.ఎన్.ఎం 1638 రకం ధాన్యం సాగు చేసి పంటలు నష్టపోయారని, వచ్చే యాసంగి లో రైతులు 1010 దొడ్డు రకం ధాన్యం సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని అన్నారు. రైతుల పట్ల మిల్లర్స్ గౌరవం తో నడుచుకోవాలని మిల్లర్స్ కి సూచించారు. అంతే కాకుండా జిల్లా లోని రైతు లు ఎలాంటి సమస్య ఉత్పన్నం అయినా తన నంబర్ 9948291816కి కాల్ చేసి సమాచా రం అందిస్తే సమస్య పరిస్కారం కొరకు వెంటనే కృషి చేస్తానని హమీ ఇచ్చారు.