నక్సల్స్ బాధితులు అదైర్య పడొద్దు
– ప్రభుత్వ సాయం అందిస్తాం
– నక్సల్స్ చేతిలో మృతిచెందిన వారి కుటుంబాలకు పరామర్శ : ఎస్పీ శబరీష్
ములుగు ప్రతినిధి : ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతూ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న మావోయి స్టులకు ఎవరూ సహకరించొద్దని, వారి చేతిలో నష్టపోయిన బాధితులు అధైర్య పడొద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ సూచించారు. ప్రభుత్వం నుంచి అందించే ఎక్స్గ్రేషియా త్వరగా అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని నక్సలైట్ల చేతిలో మృతి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ ల కుటుంబా లను పరామర్శించిన జిల్లా ఎస్పీ శబరీష్ అధైర్య పడొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్గ్రేషియా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరు కుటుంబాల లోనిల పిల్లల చదువు కోసం తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. మావోయిస్టులు పనికిరాని సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. లొంగిన మావోలకు జీవన భృతి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థాపిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.